: పీల్చిన గాలికి బిల్లు వేసిన చైనా హోటల్

బీజింగ్ లో కాలుష్యం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే, ప్రపంచంలో కాలుష్యంపై ఏ నివేదిక విడుదల చేసినా, బీజింగ్ అత్యంత కాలుష్య కారకమైన నగరమని చెబుతారు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ హోటల్ యాజమాన్యం తమ హోటల్ లో చిత్రమైన సౌకర్యం కల్పించామని చెబుతూ డబ్బులు చేసుకుంటోంది. ఆ హోటల్ లో భోజనం ముగించిన తరువాత భోజనం బిల్లుతోపాటు వారున్న సమయాన్ని బట్టి అదనపు బిల్లును కూడా వడ్డిస్తున్నారు. దీంతో మండిపడిన వినియోగదారులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ అదనపు బిల్లు ఏంటని నిలదీయడంతో తమ హోటల్ లో స్వచ్ఛమైన గాలిని సరఫరా చేస్తున్నామని, ఎయిర్ ప్యూరిఫయర్లు పెట్టేందుకు చాలా ఖర్చు చేశామని వెల్లడించింది. అందుకే గంటకు ఒక యువాన్ (10.35 రూపాయలు) వసూలు చేస్తున్నామని చెప్పింది. దీంతో మండిపడిన వినియోగదారులు హోటల్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు తక్షణం బిల్లు ఆపేయాలని ఆదేశించారు. దీంతో దిగివచ్చిన సదరు యాజమాన్యం, తమ హోటల్ లో గాలి ఫ్రీయే అంటోంది.

More Telugu News