: రూ. 50 వేలు దాటి బిల్లు కట్టినా రూ. 2 లక్షలకు మించి డబ్బు వాడినా..!

నల్లధనాన్ని మరింతగా కట్టడి చేసేందుకు మోదీ సర్కారు మరిన్ని నిర్ణయాలు తీసుకోనుంది. వీటిల్లో భాగంగా, కొత్త సంవత్సరం నుంచి లావాదేవీల నిబంధనలు మారనున్నాయి. రూ. 50 వేలకు మించే అన్ని రకాల ఖర్చులు... అంటే, విదేశీ ప్రయాణాలు, హోటల్ బిల్లులు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లకు, రూ. 2 లక్షలకు మించే అన్ని రకాల లావాదేవీలకూ పాన్ నంబర్ వెల్లడించడం తప్పనిసరి కానుంది. రూ. 50 వేల వరకూ చెల్లింపులకు పాన్ వెల్లడిపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కాగా, రూ. 2 లక్షల విషయంలోనూ త్వరలో నిర్ణయం వెలువడుతుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం రూ. 5 లక్షలకు మించిన ట్రాన్సాక్షన్లకు మాత్రమే పాన్ తప్పనిసరిగా ఉంది. వాస్తవానికి లక్ష రూపాయలకు మించిన అన్ని లావాదేవీలకూ పాన్ తప్పనిసరి చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించిన జైట్లీ, ఆపై ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విమర్శలకు తలొగ్గి, దాన్ని రూ. 2 లక్షలకు పెంచారు.

More Telugu News