: రూ. 10 వేల నుంచి రూ. 6.8 లక్షల వరకూ పెరగనున్న కార్ల ధరలు... పూర్తి జాబితా!

పెరిగిన పన్నులు, ఉత్పత్తి వ్యయాలను కారణాలుగా చూపుతూ, కొత్త సంవత్సరం నుంచి కార్ల ధరలను పెంచాలని ఆటో ఇండస్ట్రీ కంపెనీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్లోని అన్ని కార్ల ధరలూ రూ. 10 వేల నుంచి రూ. 6.8 లక్షల వరకూ పెరగనున్నాయి. ఏ సంస్థ ఎంతమేర ధరలను పెంచనున్నదంటే... * మారుతి సుజుకి: ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న ఈ సంస్థ తన అన్ని మోడళ్లపైనా రూ. 20 వేల వరకూ భారం మోపనుంది. * హ్యుందాయ్ మోటార్స్: సౌత్ కొరియా కేంద్రంగా భారతీయులకు దగ్గరైన హ్యుందాయ్, తానందిస్తున్న కార్లపై రూ. 30 వేల వరకూ ధరలను పెంచనుంది. * టయోటా కిర్లోస్కర్: జపాన్ కేంద్రంగా ఇండియాలో వాహనాలను అమ్ముతున్న సంస్థ కనీసం రూ. 10 వేల నుంచి రూ. 3.8 లక్షల వరకూ ధరలను పెంచాలని నిర్ణయించింది. * మెర్సిడిస్ బెంజ్ ఇండియా: ఈ సంస్థ ఇండియాలో అందిస్తున్న కార్ల ధరలు రూ. 27.5 లక్షల నుంచి మొదలై రూ. 2.7 కోట్ల వరకూ ఉన్నాయి. వీటిపై కనీసం 2 నుంచి 3 శాతం ధర పెంచినా, ఆ భారం రూ. 55 వేల నుంచి రూ. 5.4 లక్షల వరకూ కస్టమర్లపై పడుతుంది. * బీఎండబ్ల్యూ ఇండియా: హైఎండ్ లగ్జరీ కార్లను విక్రయిస్తున్న సంస్థ ధరలను పెంచితే, రూ. 57 వేల నుంచి రూ. 6.8 లక్షల వరకూ కార్లు భారమవుతాయి. * జనరల్ మోటార్స్: తమ వాహనాలపై 3 శాతం ధరలు పెంచాలని నిర్ణయించిన జనరల్ మోటార్స్ అందించే వాహనాలు కొనాలంటే అధికంగా రూ. 33,700 వరకూ చెల్లించాల్సి వుంటుంది. నిస్సాన్: ఎంచుకునే మోడల్ ను బట్టి రూ. 55 వేల వరకూ ధరలు పెరగనున్నాయని ఇప్పటికే నిస్సాన్ వెల్లడించింది. రినాల్ట్ ఇండియా: ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న రినాల్ట్ ఎస్ఎఎస్ అనుబంధ సంస్థగా ఇండియాలో పనిచేస్తున్న ఈ సంస్థ తన వాహనాల ధరలను రూ. 50 వేల వరకూ పెంచనుంది. స్కోడా: స్కోడా అందిస్తున్న ఎంటైర్ రేంజ్ పై జనవరి నుంచి రూ. 50 వేల వరకూ అదనపు భారం పడనుంది. టాటా మోటార్స్: పాసింజర్ కార్ సెగ్మెంట్ లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ కార్ల ధరలు రూ. 20 వేల వరకూ పెరగనున్నాయి.

More Telugu News