: చిన్న సాయం... పెద్ద ప్రయోజనం!

ఎవరికైనా మనం సాయం చేస్తే పోయేదేమీ లేదు, పైగా మనకు ప్రయోజనం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. ఎవరికైనా సాయం చేసిన రోజున ఆ ప్రభావం రోజు వారీ ఒత్తిడి, మానసిక ఆరోగ్యం, ఆలోచనలపై పడుతుందని పరిశోధకులు వెల్లడించారు. అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లున్న 77 మందిని 14 రోజుల పాటు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల్లో ఈ 77 మంది రోజు వారీ పనులు, ప్రవర్తన, ఒత్తిడి వంటి విషయాలతో పాటు వారు ఎవరికైనా సాయం చేశారా? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇతరులకు ఏదైనా సహాయం చేసిన రోజున వారంతా తక్కువ ఒత్తిడికి గురవుతున్నట్టు గుర్తించారు. అలాగే సానుకూలంగా ఆలోచిస్తూ, మానసికంగా దృఢంగా ఉన్నట్టు తేలిందని పరిశోధకులు తెలిపారు. అందుకే 'తోటి వారికి ఏదైనా సాయం చేయండి, హాయిగా ఉండండి' అని అంటున్నారు.

More Telugu News