: 'యాహూ' మెయిల్ లో ఇక నుంచి 'జీమెయిల్' సౌకర్యం!

యాహూ మెయిల్, జీ మెయిల్ రెండూ వేర్వేరు. అయితే ఇకపై యాహూలోనే జీ మెయిల్ ఖాతా తెరచి వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని యూహూ వెల్లడించింది. జీమెయిల్, గూగుల్ యాప్స్ కు సర్వర్ సైడ్ సపోర్టును విస్తృతం చేస్తున్నామని యాహూ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నూతన ఫీచర్ యూజర్లను మరింత ఆకట్టుకుంటుందని తెలిపారు. ఔట్ లుక్, హాట్ మెయిల్, ఏవోఎల్ మెయిల్ వంటి వాటిని యాహూ మెయిల్ ఇప్పటికే సపోర్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జీమెయిల్ కూడా చేరింది. వినియోగదారులు మరింత సమర్థవంతంగా మెయిల్ సేవలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మరిన్ని ఫీచర్లను కూడా భవిష్యత్తులో వినియోగదారులకు అందిస్తామన్నారు.

More Telugu News