: ఆ'రేంజ్’లో మనకు ఆరోగ్యాన్నిస్తుంది!

ఆరోగ్యానికి ఆరెంజ్ (నారింజ) ఎంతో మంచిది. మన శరీరానికి ఉపయోగపడే విటమిన్-సి, బీటా కెరోటిన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎన్నో ఈ పండులో ఉన్నాయి. సిట్రస్ జాతికి చెందిన నారింజలో పులుపు, తీపి రకాలుంటాయి. తీపి నారింజలో నీరు తక్కువగా, లవణాలు ఎక్కువగా ఉంటాయి. అదే, పులుపు నారింజలో నీరు ఎక్కువగా ఉండి, లవణాలు అధికంగా ఉంటాయి. పులుపు నారింజ కంటే తీపి నారింజను తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. నారింజను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల విషయాని కొస్తే.. * రక్త శుద్ధి జరుగుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. * గుండె పనితీరు మెరుగ్గా ఉంచుతుంది * చర్మం ఆరోగ్యవంతంగా ఉండేలా చూస్తుంది * జలుబు, దగ్గు దరిచేరవు * ఆస్తమా, టీబీ వంటి వ్యాధులతో బాధపడేవారికి నారింజ ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుంది * గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ లోపం రానివ్వదు * మలబద్ధకం దరిచేరనీయకుండా చూడటంతో పాటు ఇంకా పలు రకాల ప్రయోజనాలను నారింజ ద్వారా పొందవచ్చును.

More Telugu News