: అందుబాటులోకి వచ్చిన ప్రపంచపు తొలి డెంగ్యూ వాక్సిన్

ప్రాణాంతక డెంగ్యూ వ్యాధికి మొట్టమొదటి వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఔషధాన్ని మెక్సికో తయారు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది డెంగ్యూ రోగులపై క్లినికల్ ట్రయల్స్ అనంతరం, మార్కెట్లో విడుదల చేసేందుకు అనుమతి లభించిందని మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ వాడకం వల్ల ఏటా 64 మిలియన్ డాలర్లు ఆదా చేసుకోవచ్చని, వేల మంది ఆసుపత్రుల పాలు కాకుండా నివారించవచ్చని వివరించారు. తీవ్రమైన డెంగ్యూ వ్యాధిపై ఈ వ్యాక్సిన్ 93.2 శాతం సత్ఫలితాలు చూపిందని తెలిపారు. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం, ప్రపంచంలో 390 కోట్ల మంది ప్రజలు డెంగ్యూ సోకే పరిస్థితుల్లో నివాసం ఉంటున్నారు. 128 దేశాల్లోని 40 కోట్ల మంది ప్రతియేటా దోమకాటు వల్ల పలు వ్యాధుల బారిన పడుతున్నారు.

More Telugu News