: స్వదేశీకే ఓటు... కోటి వేతనంతో విదేశీ ఉద్యోగాలను కాదన్న ఐఐటీ స్టూడెంట్స్

ప్రధాని నరేంద్ర మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదం బాగానే పనిచేస్తున్నట్లుంది. కోట్లలో వేతనాలు లభిస్తున్న విదేశీ ఉద్యోగాలను కాదని లక్షల వేతనాలిచ్చే స్వదేశీ కొలువులకే ఓటేశారు ఢిల్లీ ఐఐటీకి చెందిన నలుగురు భావి ఇంజినీర్లు. ఇటీవల ఢిల్లీ ఐఐటీలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మొత్తం 8 మందికి విదేశీ ఆపర్లు వచ్చాయి. ఒక్కొక్కరికీ కోటి రూపాయలకు పైగా వేతనాన్ని సదరు బహుళ జాతి సంస్థలు ఆఫర్ చేశాయి. అయితే ఆ 8 మందిలో నలుగురు విద్యార్థులు విదేశీ కొలువులు తమకు వద్దని చెప్పేశారు. ఇక స్వదేశీ కంపెనీల నుంచి కూడా వారికి ఆఫర్లు వచ్చాయట. అయితే విదేశీ కంపెనీలు ఆఫర్ చేసిన వేతనంలో ఐదో వంతు శాలరీనే స్వదేశీ కంపెనీలు ఇస్తాయట. అయినా ఫరవా లేదు... విదేశీ కంటే స్వదేశీనే ముద్దంటూ ఆ నలుగురు విద్యార్థులు స్వల్ప వేతనాలతో దేశీయ కొలువులకే జైకొట్టారు.

More Telugu News