: సెన్సెక్స్ డౌన్... భారీ నష్టాల్లో బ్యాంకులు, విద్యుత్ సంస్థల ఈక్విటీలు

అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు భారత మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును అమ్మకాల వైపు నడిపించగా, బ్యాంకింగ్, విద్యుత్ కంపెనీల ఈక్విటీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ కీలకమైన 7,800 పాయింట్ల వద్ద మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ కంపెనీలు భారీ ఎత్తున ఈక్విటీలను విక్రయించినట్టు సెబీ గణాంకాలు వెల్లడించాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 248.51 పాయింట్లు పడిపోయి 0.96 శాతం నష్టంతో 25,638.11 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 82.25 పాయింట్లు పడిపోయి 1.05 శాతం నష్టంతో 7,781.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.05 శాతం, స్మాల్ క్యాప్ 64 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 8 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. సన్ ఫార్మా, కెయిర్న్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ, టాటా స్టీల్ తదితర కంపెనీలు లాభపడగా, జడ్ఈఈఎల్, టాటా పవర్, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,88,473 కోట్లకు పెరిగింది. మొత్తం 2,912 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,177 కంపెనీలు లాభాలను, 1,567 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News