: మరింతగా దిగజారి రెండేళ్ల కనిష్ఠానికి రూపాయి విలువ... స్టాక్ మార్కెట్లూ అంతే!

భారత స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్లు ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్ఠానికి దిగజారింది. క్రితం ముగింపుతో పోలిస్తే 30 పైసలు పడిపోయి రూ. 66.95కు చేరుకుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లలో సైతం ఇన్వెస్టర్ల కొనుగోలు సెంటిమెంటు అంతంతమాత్రంగానే ఉంది. అమ్మకాల కన్నా కొనుగోళ్లు అధికంగా కనిపిస్తుండటంతో, బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆపై స్వల్పంగా తేరుకుని ఉదయం 10:55 గంటల సమయంలో 170 పాయింట్ల నష్టంతో 25,717 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 60 పాయింట్ల నష్టంలో ఉంది.

More Telugu News