: డిస్కౌంట్లు ఫ్లిప్ కార్ట్ కొంపముంచాయి!...రూ.2 వేల కోట్ల నష్టంలో ఈ-కామర్స్ దిగ్గజం

ఈ-కామర్స్ రంగంలో అనతి కాలంలో దిగ్గజ కంపెనీగా ఎదిగిన ఫ్లిప్ కార్ట్ గతేడాది ఆఖరు త్రైమాసికంలో భారీగా నష్టాలు చవిచూసింది. అప్పటిదాకా లాభాలతో పరుగులు పెట్టిన ఈ సంస్థ గతేడాది ఆఖరు క్వార్టర్ కు సంబంధించి భారీ నష్టాలతో సతమతమైంది. అయినా వినూత్న ఆపర్లతో భారీ సంఖ్యలో కొనుగోళ్లకు కేంద్రంగా నిలిచిన ఫ్లిప్ కార్ట్ కు నష్టాలు వచ్చాయంటే నమ్మడం అసాధ్యమే. అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు ఆ సంస్థ సమర్పించిన పత్రాల్లోనూ సదరు నష్టాలు స్పష్టంగా కనిపిస్తుంటే, నమ్మక తప్పడం లేదు. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫ్లిప్ కార్ట్ కు ఏకంగా రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందట. దీనికంతటికీ కారణమేంటంటే... అడక్కున్నా భారీ ఆపర్లంటూ హోరెత్తిన ప్రచారమే. ఈ-కామర్స్ రంగంలో సత్తా చాటేందుకు భారీ డిస్కౌంట్లు ఇవ్వక తప్పడం లేదు. ఫ్లిప్ కార్ట్ కూడా అదే చేసింది. అమ్మకాలు భారీగా పెరిగాయి. ఉత్పత్తిదారుడు ఇచ్చే రిబేటుతో పాటు ఫ్లిప్ కార్డ్ కూడా కొంతమేర సబ్సీడీ ఇచ్చింది. ఈ కారణంగానే ఫ్లిప్ కార్ట్ కు నష్టాలు వచ్చాయట. ఈ నష్టంలో ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ పోర్టల్ కు రూ.1,096 కోట్ల నష్టం రాగా, హోల్ సేల్ అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇండియాకు రూ.836. కోట్ల మేర నష్టం వాటిల్లిందట.

More Telugu News