: వైఫై పాతమాట... 224 జీబీపీఎస్ సామర్థ్యంతో 'లిఫై' వచ్చేస్తోంది!

స్మార్ట్ ఫోన్లలో మొబైల్ డేటా ఏ మాత్రమూ ఖర్చుకాకుండా, వైఫై సిగ్నల్స్ అందుకుని డేటా బట్వాడా చేసుకుంటున్న నెటిజన్లకు మరో శుభవార్త. వైఫైల స్థానంలో ఎల్ఈడీ బల్బుల ఆధారంగా పనిచేసే 'లిఫై' వచ్చేస్తోంది. నాలుగేళ్ల క్రితం కనుగొన్న ఈ విధానం ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది, సెకనుకు 224 గిగాబైట్ల డేటా బట్వాడా సామర్థ్యంతో వస్తోంది. ఈ ఎల్ఈడీ బల్బు కాంతి ఎంత దూరమైతే కనిపిస్తుందో ఆ ప్రాంతమంతా సిగ్నల్స్ ప్రసరిస్తుంటాయి. ఇదే 'లిఫై'కి బలమని విశ్లేషకులు భావిస్తున్నారు. డేటా పంపిణీ విధానంలో ఇది అత్యంత వేగంగా పనిచేస్తుందని టెక్కీలు చెబుతున్నారు.

More Telugu News