: ఢిల్లీ విద్యార్ధి రికార్డును బద్దలుకొట్టిన పుణే స్టూడెంట్.. గూగుల్ లో రూ.2 కోట్ల వేతనంతో కొలువు

కోట్ల రూపాయల వేతనంతో కొత్త కొలువులను చేజిక్కించుకుంటున్న భారత విద్యార్థులు విశ్వ విపణిలో దూసుకెళుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)కి చెందిన విద్యార్థి చేతన్ కక్కర్ గూగుల్ సంస్థలో రూ.1.27 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులు గడిచాయో, లేదో ఈ రికార్డు బద్దలైంది. పుణేకు చెందిన 22 ఏళ్ల అభిషేక్ పంత్ గూగుల్ లోనే రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని చేజిక్కించుకున్నాడు. ఐఐటీ ఖరగ్ పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో ఫైనల్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్న అభిషేక్, ఇటీవలే మూడు నెలల ఇంటర్న్ షిప్ ను గూగుల్ లో దిగ్విజయంగా ముగించాడు. గూగుల్ ముఖ్య విభాగం డిజైన్ సొల్యూషన్స్ సెల్ ఉద్యోగానికి ఎంపికైన అభిషేక్ విద్యాభ్యాసం పూర్తి కాగానే విధుల్లో చేరనున్నాడు. ఇటీవల గూగుల్ నిర్వహించిన అత్యంత కఠినమైన ప్రశ్నలతో కూడిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ సాంకేతిక సిబ్బందిని తన సమాధానాలతో అబ్బురపరిచాడు.

More Telugu News