: అధిక బరువుతో బాధపడుతున్నారా?...అయితే 'ఈ' లోపం ఉందేమో చూసుకోండి!

అధిక బరువుతో బాధపడేవారు 'ఈ' విటమిన్ లోపంతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు ఒత్తిడి, శారీరక రుగ్మతలు, ఆహారపుటలవాట్ల కారణంగా వస్తుందని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఒత్తిడి తట్టుకునేందుకు 'ఈ' విటమిన్ ఎంతో ఉపయోగపడుతుందని వారు సూచిస్తున్నారు. 'ఈ' విటమిన్ తృణధాన్యాలు, ఆలివ్ నూనెల్లో బాగా లభిస్తుంది. 'ఈ' విటమిన్ లోపం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మెటబాలిజమ్ సమస్యలు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. స్థూలకాయుల రక్తంలో విటమిన్ 'ఈ' ఉంటుంది కానీ, కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీరాల్లో మాత్రం విటమిన్ 'ఈ' లోపించి ఉంటుందని వారు చెప్పారు. కొవ్వు అధికంగా ఉన్నవారికి విటమిన్ 'ఈ' అందిస్తే అధిక బరువు సమస్యను నిరోధించవచ్చని వారు తెలిపారు.

More Telugu News