: మరింతగా తగ్గిన క్రూడాయిల్ ధరలు... అదే దిశగా పెట్రోలు సైతం!

అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు మరింతగా తగ్గాయి. డిమాండ్ కు మించిన సరఫరా ఉండటమే ఇందుకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. వెస్ట్ టెక్సాస్ మార్కెట్లో డిసెంబర్ డెలివరీ క్రూడాయిల్ ధర బ్యారలుకు 1.28 డాలర్లు తగ్గి 42.93 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ ధర 1.63 డాలర్లు తగ్గి 45.81 డాలర్లకు చేరింది. ఇక భారత కరెన్సీలో ఈ నెల 19న డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 49 తగ్గి, 1.67 శాతం నష్టంతో రూ. 2,892 వద్ద కొనసాగుతోంది. బ్యారల్ ధర రూ. 3 వేల కన్నా దిగువకు వచ్చి స్థిరంగా ఉండటంతో మరో మూడు రోజుల్లో జరిగే ఓఎంసీ (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్)ల సమావేశంలో 'పెట్రో' ఉత్పత్తుల ధరను కొంత మేరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News