: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 378 పాయింట్లు కోల్పోయి 25,743కు పతనమైంది. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 7,783కు దిగజారింది. సెప్టెంబర్ 8వ తేదీ తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు పతనమవడం ఇదే తొలిసారి. ఇక ఇవాల్టి టాప్ గెయినర్లలో కైలాష్ ఆటో ఫైనాన్స్ (4.95%), కోరమాండల్ ఇంటర్నేషనల్ (4.11%), ఐఎఫ్ సీఐ (3.78%), హ్యాత్ వే కేబుల్ అండ్ డేటా (3.71%), జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (3.56%) ఉన్నాయి. టాప్ లూజర్లలో పీఎంసీ ఫిన్ కార్ప్ (-9.90%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-9.25%), హిందుస్థాన్ పెట్రోలియం (-7.60%), మదర్సన్ సుమి సిస్టమ్స్ (-6.41%), హిందుస్థాన్ జింక్ (-6.29%) ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ షేర్లు 5.65 శాతం పడిపోయాయి.

More Telugu News