: డాక్టర్ రెడ్డీస్ పై అమెరికా చావుదెబ్బ!

"తెలుగు రాష్ట్రాల్లోని డాక్టర్ రెడ్డీస్ ఔషధ ఉత్పత్తి కేంద్రాల్లో తయారవుతున్న ఔషధాలు నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేవు. ఈ కేంద్రాల్లో తయారు చేస్తున్న మందులను ఎందుకు నిషేధించకూడదో రెండు వారాల్లో సంజాయిషీ ఇవ్వండి" అని అమెరికా ఎఫ్డీయే (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) విభాగం నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కు వచ్చిన నోటీసులు ఆ సంస్థ ఈక్విటీపై చావుదెబ్బ కొట్టాయి. ఎఫ్డీయే హెచ్చరికలు అందాయన్న వార్త బయటకు వచ్చిన నాటి నుంచి సంస్థ ఈక్విటీ 20 శాతం నష్టపోయింది. మంగళవారం నాటి సెషన్లో మరో 4 శాతం దిగజారి రూ. 3,358కి చేరింది. యూఎస్ నోటీసుల విషయం తేలేవరకూ కంపెనీ కొత్త ఔషధాల అనుమతులు ఆగిపోతాయన్న విషయం తెలుసుకున్న ఇన్వెస్టర్లు ఈక్విటీలను అమ్మేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే జూన్ 18, 2015 నాటి స్థాయికి దిగజారిన డాక్టర్ రెడ్డీస్ ఈక్విటీ మరింతగా పతనం కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రెడ్డీస్ ఈక్విటీ 52 వారాల కనిష్ఠస్థాయి రూ. 3,010ని తాకగా, త్వరలో కొత్త లోయస్ట్ ధర నమోదు కావచ్చని అంచనా.

More Telugu News