: ఇలాగ కూడా బరువును తగ్గించుకోవచ్చు!

బరువు తగ్గాలంటే ఏం చేయాలి? రోజూ వ్యాయామం చేయాలి, పరుగెత్తాలి, ఏరోబిక్స్ చేయాలి అంటారా? ఇవన్నీ బరువు తగ్గేందుకు సహకరిస్తాయనడంలో సందేహం లేదు. అయితే, శరీరంలోని కొవ్వు పూర్తిగా కరగాలంటే మాత్రం ఇంకా చేయాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన తరవాత దృఢత్వం కోల్పోయే కండరాలను కాస్త గట్టిగా ఉంచేలా వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. కండరాలు గట్టి పడుతుంటే, బరువు దానంతట అదే తగ్గుతూ వస్తుందని సలహా ఇస్తున్నారు. కేవలం వ్యాయామానికే పరిమితం కాకుండా, తీసుకుంటున్న ఆహారంపై కూడా దృష్టిని సారిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పొట్టు తీయని ధాన్యంతో తయారయ్యే వంటలు, అధికంగా పండ్లు, జీడిపప్పు, బాదం వంటి నట్స్, తృణధాన్యాలు, కొవ్వు చాలా తక్కువగా ఉండే మాంస పదార్థాలు, పాలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు వేళకు నిద్రించాలని, శరీరానికి చాలినంత విశ్రాంతి అత్యవసరమని సలహా ఇచ్చారు. కంటి నిండా నిద్ర లేకుంటే, శరీరంలో లెప్టిన్, గ్రెలిన్ తదితర హార్మోన్ల పరిమాణం పెరిగి ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపిస్తుందని హెచ్చరించారు. దీని వల్ల బరువు పెరుగుతారని, కాబట్టి వేళకు నిద్రపోవాలని సూచించారు.

More Telugu News