: పాస్ వర్డ్ లేని ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్నాం: సత్య నాదెళ్ల

పాస్ వర్డ్ లేని ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ముంబైలో మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్ లీష్ డ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో పాస్ వర్డ్ తో పని లేకుండా ఫేస్ రికగ్నిషన్, థంబ్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్స్ ద్వారా యజమానిని గుర్తించే సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని అన్నారు. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భారతీయుల శక్తి, ఉత్సాహం అమోఘమని ఆయన పేర్కొన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించే దిశగా కృషి చేస్తున్నామని, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు పరీక్షల దశలో ఉందని ఆయన తెలిపారు.

More Telugu News