: వేగంగా తగ్గుతున్న బంగారం ధర... వారం వ్యవధిలో రెండు నెలల కనిష్ఠానికి

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు, రూపాయి బలపడటం తదితర కారణాలతో దేశవాళీ మార్కెట్లో బంగారం ధర శరవేగంగా తగ్గుతోంది. వారం రోజుల వ్యవధిలో పది గ్రాముల ధర రెండు నెలల కనిష్ఠానికి పడిపోయింది. గురువారం నాడు ముంబై బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 180 తగ్గి, రూ. 26,250కి చేరింది. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు నూతన కొనుగోళ్లకు ఆసక్తిని చూపలేదని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. మరోవైపు వెండి ధర కిలోకు రూ. 320 తగ్గి రూ. 35,750కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.87 శాతం తగ్గి 1,107.50 డాలర్లకు, వెండి ధర 1.28 శాతం తగ్గి 15.06 డాలర్లకు చేరింది. తదుపరి సెషన్లలో సైతం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News