: నో సైడ్ ఎఫెక్ట్స్... డయాబెటిక్ పేషెంట్లకు అందుబాటులోకి వస్తున్న హెర్బల్ మెడిసిన్

డయాబెటిక్ పేషెంట్లకు శుభవార్త. దీర్ఘకాలం నుంచి హై షుగర్ లెవెల్స్ తో బాధపడుతూ మందులు వాడుతున్న వారికోసం దివ్యౌషధం రాబోతోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బొటానికల్ గార్డెన్ ఇన్స్టిట్యూట్ (ఎన్ బీఆర్ఐ) హెర్బల్ మెడిసిన్ ను ఉత్పత్తి చేసింది. ఆయుర్వేదిక్ పద్ధతిలో తాము ఒక మెడిసిన్ ను తయారు చేశామని... టైప్-2 డయాబెటిక్ పేషెంట్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ రావత్ తెలిపారు. ట్యాబ్లెట్ రూపంలో ఉండే ఈ మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. సాధారణంగా దీర్ఘకాలంలో శరీర భాగాలపై యాంటిజెన్స్ ప్రభావం చూపుతాయి. అయితే ఎన్ బీఆర్ఐ తయారు చేసిన ట్యాబ్లెట్లలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ పునర్నిర్మాణానికి తోడ్పడతాయని రావత్ వెల్లడించారు. ఈ ఆయుర్వేదిక్ డ్రగ్ పేరు బీజీఆర్-34. వంద ట్యాబ్లెట్ల ఖరీదు రూ. 500. ఢిల్లీలోని ఓ ఫార్మా కంపెనీకి ట్యాబ్లెట్ల తయారీ, మార్కెటింగ్ హక్కులను ఇచ్చినట్టు రావత్ తెలిపారు.

More Telugu News