: బంగారం పెట్టుబడులపై ఆర్బీఐ నిబంధనలివి!

బంగారం పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని పరిగెత్తించాలని భావిస్తున్న కేంద్రం సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న విషయమై అతి త్వరలో ప్రకటన వెలువడనుంది. ఆర్బీఐ వెల్లడించిన నిబంధనల ప్రకారం... * ఈ స్కీములో భాగంగా ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో ఉంచి దానిపై వడ్డీని పొందవచ్చు. * తొలిసారిగా డిపాజిట్ చేసే వారు 995 స్వచ్ఛతగల బంగారం కనీసం 30 గ్రాములు డిపాజిట్ చేయాల్సి వుంటుంది. * బంగారం కడ్డీలు,నాణాలు, ఆభరణాలు (రాళ్లు ఉండరాదు) డిపాజిట్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి ఏమీ ఉండదు. * అన్ని వాణిజ్య బ్యాంకులూ ఈ స్కీమును ఆఫర్ చేయవచ్చు. వడ్డీ ఎంత ఇస్తారన్నది బ్యాంకుల వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడివుంటుంది. * వడ్డీ రేటు డిపాజిట్ మెచ్యూరిటీ నాటి బంగారం ధరను ప్రభావితం చేస్తుంది. వడ్డీని బంగారం రూపంలో లేదా రూపాయలుగా తీసుకోవచ్చు. * డిపాజిట్ చేసే ముందే తమకు ఎలాంటి వడ్డీ కావాలో ముందే నిర్ణయించుకోవాలి. తదుపరి మార్చుకునేందుకు అవకాశం ఉండదు. * స్వల్పకాల, (1 నుంచి మూడేళ్లు), మధ్యంతర వ్యవధి (5 నుంచి 7 సంవత్సరాలు), దీర్ఘకాల (12 నుంచి 15 సంవత్సరాలు) డిపాజిట్లు దాఖలు చేయవచ్చు. * డిపాజిట్ సమయంలోనే బంగారం స్వచ్ఛతను లెక్కించి, నికరంగా ఎన్ని గ్రాముల డిపాజిట్ ఉందన్నది బ్యాంకులు చెబుతాయి. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి పొందిన ప్యూరిటీ చెకింగ్ సెంటర్లు సహకరిస్తాయి. * కనీస లాకిన్ పీరియడ్ తరువాత పెనాల్టీతో ముందుగానే బంగారాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. పెనాల్టీ ఎంతన్నది కూడా బ్యాంకులే నిర్ణయిస్తాయి. * జాయింట్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు. ఈ విధానంలో పాత నిబంధనలు వర్తిస్తాయి.

More Telugu News