: రోజూ గోళ్ల రంగు వేసుకుంటే బరువు పెరుగుతారట!

రోజూ గోళ్ల రంగు వేసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్లకు వేసుకునే రంగు (నెయిల్ పోలిష్) ఎక్కువ రోజులు మన్నికగా ఉండేందుకు వాడే ట్రైఫీనైల్ ఫాస్పేట్ (టీపీహెచ్ పీ) కి బరువును పెంచే గుణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో ఇతర రసాయనాలు వాడేటప్పుడు పునరుత్పాదకతకు సంబంధించిన సమస్యలు తలెత్తేవి. దీంతో పరిశోధకులు ట్రైఫీనైల్ ఫాస్పేట్ వాడకం వైపు మొగ్గుచూపారు. ఇది ఎండోక్రైన్ డిజ్రప్టర్ అని నిపుణులు గుర్తించారు. 3 వేల రకాల గోళ్ల రంగులు గుర్తించగా, వాటిల్లో 49 శాతం ట్రైఫీనెల్ ఫాస్పేట్ ఉన్నట్టు గుర్తించారు. గోళ్ల రంగు వేసుకున్న 10 నుంచి 14 గంటల్లో శరీరంలో టీపీహెచ్ పీ మోతాదు ఏడు రెట్లు పెరుగుతుందని, ఇది ప్రమాదకరమని వారు తెలిపారు. దీని మోతాదు పెరిగితే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ గోళ్లకు రంగు వేసుకుని, వాటిని తగిలించుకుంటే ప్రమాదం ఉండదని వారు సలహా ఇచ్చారు.

More Telugu News