: దూసుకెళ్లిన బ్యాంకులు, ఉసూరుమన్న టెలికం సంస్థలు!

భారత స్టాక్ మార్కెట్ లాభాలు కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలతో బ్యాంకింగ్ రంగంలోని కంపెనీల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు లభించగా, టెల్కోలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నాయి. అయినప్పటికీ, లాభాలను నమోదు చేసిన కంపెనీలే అధికంగా ఉండటంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచికలు ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 183.15 పాయింట్లు పెరిగి 0.67 శాతం లాభంతో 27,470.81 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 43.75 పాయింట్లు పెరిగి 0.53 శాతం లాభంతో 8,295.45 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.26 శాతం, స్మాల్ క్యాప్ 0.37 శాతం నష్టపోవడం గమనార్హం. ఎన్ఎస్ఈ-50లో యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, కెయిర్న్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, గెయిల్ తదితర కంపెనీలు లాభపడగా, ఐడియా, భారతీ ఎయిర్ టెల్, వీఈడీఎల్, ఎల్అండ్ టీ, మారుతి సుజుకి తదితర కంపెనీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,00,44,086 కోట్లుగా ఉంది.

More Telugu News