: బంగారం తగ్గింది, వెండి పెరిగింది!

ఆభరణాల తయారీదారులు, స్టాకిస్టులు బంగారం కొనుగోళ్ల పట్ల ఉత్సాహం చూపలేకపోయారు. ఇదే సమయంలో పరిశ్రమల వారు, నాణాల తయారీదారుల నుంచి వచ్చిన మద్దతుతో వెండి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో శుక్రవారం నాటి సెషన్లో బంగారం ధర తగ్గగా, వెండి ధర పెరిగింది. ఈ సెషన్లో పది గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ముగింపుతో పోలిస్తే రూ. 200 పడిపోయి రూ. 27,200కు చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 385 పెరిగి రూ. 37,285కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.3 శాతం పెరిగి 1,169 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

More Telugu News