: ఐఫోన్లపై అసంతృప్తి... ఇతర స్మార్ట్ ఫోన్ల నుంచి కాపీ కొట్టిన ఫీచర్లివి!

రెండు రోజుల క్రితం భారత మార్కెట్లో విడుదలైన యాపిల్ కొత్త తరం ఫోన్లు ఐఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ లను వాడి చూసిన వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్లలోని అత్యధిక ఫీచర్లు ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్ల నుంచి కాపీ కొట్టినవి కావడమే ఇందుకు కారణం. రూ. 60 వేలకు పైగా డబ్బు పెట్టి కొన్న ఫోన్లో కాపీ కొట్టిన ఫీచర్లున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఫోన్ లోని 3డీ టచ్ ఫీచర్ బ్లాక్ బెర్రీ స్ట్రామ్-2, హువావే ఫోన్ల నుంచి, లైవ్ ఫోటో ఫీచర్ ను హెచ్ టీసీ ఫోన్ల నుంచి కాపీ కొట్టారని అంటున్నారు. ఇక 4కే వీడియో రికార్డింగ్ ఇప్పటికే సోనీ ఎక్స్ పీరియా జడ్3, ఎల్జీ జీ3 ఫోన్లలో ఉందని, ప్లేబ్యాక్ జూమ్ ఫీచర్ యాపిల్ కు కొత్తదే అయినా, సంవత్సరాల క్రితమే శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో ఉందని తెలుస్తోంది. యాపిల్ గొప్పగా చెప్పుకున్న రెటీనా ఫ్లాష్ ను ఒప్పో ఆర్7 ప్లస్ ఎన్నడో అందించగా, ఫ్రంట్ ఫ్లాష్ సైతం పలు ఫోన్లలో అందుబాటులో ఉంది. యాపిల్ "హే సిరీ" అంటూ, వాయిస్ రికగ్నిషన్ సేవలను ఈ స్మార్ట్ ఫోన్లలో అందించగా, ఈ తరహా ఫీచర్ ను కోర్టానా, మైక్రోసాఫ్ట్ ల్యూమియా ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ ఫోన్ ను వాడుతుంటే, కొత్త ఫీచర్లతో వచ్చిన సరికొత్త ఫోన్ వాడుతున్నట్టు లేదన్నది స్మార్ట్ ఫోన్ ప్రియుల అభిప్రాయం.

More Telugu News