ఇంత జరుగుతున్నా ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారు?: కేజ్రీవాల్

17-10-2015 Sat 15:14

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతుండటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారాలకు గురై, జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఈ రోజు కేజ్రీవాల్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్లలను కాపాడుకోవడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులపై పెత్తనమంతా కేంద్రం చేతుల్లోనే ఉండటం వల్ల, తాము ఏమీ చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారు.