నెట్ లోకి వచ్చేసిన ‘బ్రూస్ లీ’ చిరు ఎంట్రీ సీన్...తొలగించే యత్నంలో సినిమా యూనిట్

17-10-2015 Sat 13:45

చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ ప్రధాన భూమికగా తెరకెక్కిన ‘బ్రూస్ లీ’ చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించి తన అభిమానులకు కనువిందు చేశారు. అయితే సదరు చిత్రంలోని చిరు ఎంట్రీకి సంబంధించిన చిన్నపాటి వీడియో ఒకటి అప్పుడే నెట్ లోకి వచ్చేసింది. చాలా కాలం తర్వాత చిరును సిల్వర్ స్క్రీన్ పై చూసి మైమరచిన ఆయన అభిమానుల్లోని కొందరు చిరు ఎంట్రీని సెల్ ఫోన్ లో రికార్డు చేసి నెట్ లో పెట్టేశారు. సినిమా రిలీజై ఒక్క రోజు కూడా గడవకముందే ఈ సీన్లు నెట్ లో ప్రత్యక్షం కావడంతో సినిమా యూనిట్ కంగుతింది. వెనువెంటనే అప్రమత్తమైన దర్శక నిర్మాతలు సదరు వీడియోను నెట్ లో నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు.