టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పితృవియోగం

17-10-2015 Sat 11:20

గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తండ్రి కన్నుమూశారు. ఆయన తండ్రి రమేష్ చంద్ (67) అనారోగ్యంతో చనిపోయారు. వంశీ తండ్రి యూటీఎఫ్ నేతగా, వ్యవస్థాపక సభ్యుడిగా గన్నవరంలో మంచి పేరు సంపాదించుకున్నారు.