తుపాను వచ్చినా అమరావతి వేదిక చెక్కు చెదరదట...‘మెన్ ఎట్ వర్క్’కు పనుల అప్పగింత

17-10-2015 Sat 10:53

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలు దేశాల ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేందుకు ఏపీ సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఉద్ధండరాయునిపాలెంలో ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను మరింత పకడ్బందీగా ఏర్పాటు చేస్తోంది. ఈ వేదిక పనులను నిర్మాణ రంగంలో విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతిగాంచిన ‘మెన్ ఎట్ వర్క్’కు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. అత్యంత ధృడంగా తయారవుతున్న ఈ వేదిక తుపాను వచ్చినా చెక్కు చెదరదట.