బీహార్ లో మోదీ ఓటమి ఖాయం: కేజ్రీవాల్

16-10-2015 Fri 14:43

బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు రానున్నాయని... మోదీకి ఘోర ఓటమి ఖాయమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. ఈ రోజు బీహార్ లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో, కేజ్రీవాల్ తన అభిప్రాయాలను ట్విట్టర్లో వెల్లడించారు. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ పార్టీ జేడీయూకు కేజ్రీవాల్ ఇప్పటికే పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆయన పాల్గొనలేదు.