భద్రతాపరంగా గట్టి చర్యలు తీసుకుంటున్నాము: డీజీపీ జేవీ రాముడు

15-10-2015 Thu 20:50

ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు పేర్కొన్నారు. సభా ప్రాంగణం పూర్తి భద్రతా వలయంలో ఉంటుందని, కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ సహా ప్రముఖులందరికీ భారీ భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు పాసులు కచ్చితంగా తీసుకురావాలని, వాటితో వస్తే ఎలాంటి ఆటంకం లేకుండా లోపలికి వెళ్లవచ్చన్నారు. వీఐపీలు, సామాన్యుల కోసం రవాణాపరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీఐపీల వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు అన్ని చర్యలు చేపడతామని డీజీపీ చెప్పారు.