‘స్థానికత’ అంశంపై వెంకయ్యనాయుడు సమావేశం

15-10-2015 Thu 19:53

స్థానికత అంశంపై ముగ్గురు మంత్రులతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, ఆర్థిక శాఖల మంత్రులతో ఆయన మాట్లాడారు. స్థానికత అంశాన్ని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ముగ్గురు మంత్రులకు వెంకయ్యనాయుడు వివరించారు. ఏపీ కోరుకున్న స్థానికత అంశానికి ఆదేశాలు ఇచ్చేందుకు సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. స్థానికత విధివిధానాలను రూపొందించే బాధ్యతను అధికారులకు అప్పగించినట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ నుంచి తుది ముసాయిదా వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.