మగవాడిని అతిగా నమ్మకండి: నటి కంగానా రనౌత్

15-10-2015 Thu 14:52

ప్రేమలో పడి సక్సెస్ బాటపడితే సంతోషమే. కానీ, విఫలమైతే... ఈ జీవితం ఎందుకురా! అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనిపిస్తుంది. ఒకవేళ, ఆ ఆలోచనను అధిగమిస్తే... చాలా లైట్ గా తీసుకుంటే... జీవితం కలర్ ఫుల్ గా ఉంటుంది. మరి, అటువంటి ఆలోచనా విధానం ఉన్నవాళ్లు ఎంతమంది ఉంటారు?. ఇంతమంది అని కచ్చితంగా చెప్పలేము. కానీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాత్రం ఆ కోవకు చెందిన వ్యక్తే అని చెప్పవచ్చు. ఎందుకంటేే, ఆమె చెప్పిన మాటలే నిదర్శనం కనుక. "లవ్ లో విఫలమవడం అంటే నా జీవితానికో మంచి అనుభవంగా భావిస్తా. హ్యాండిచ్చిన వ్యక్తి గురించి అంతగా ఆలోచన చేయను. నేనంటే నాకు చెప్పలేనంత ప్రేమ. దీంతో ఆ వ్యక్తిని మర్చిపోవడం సులభం. ఒక వ్యక్తి నుంచి విడిపోయాక అతన్ని నేను మర్చిపోవడానికి నెల రోజులు... కేవలం ఒక్క నెల రోజులు చాలు. ప్రేమలో పడి మోసపోయే ఆడవాళ్లకు నా సలహా ఏమిటంటే.. మగవాడిని అతిగా నమ్మద్దు. నమ్మితే మోసపోతారు. అతని నుంచి విడిపోయినా బతకగలగాలి. బాగా బతకగలగాలి. కలసి ఉన్నప్పుడు కన్నా మంచిగా బతకగలిగితే... మన జీవితాన్ని చూసి మనమే గర్వపడతాము. నమ్మకస్తుడితో కనుక లవ్ ఎఫైర్ ఉంటే అతని బంధాన్ని కాపాడుకోవాలి... చివరి వరకు కొనసాగాలి" అంటూ తన మనస్సులో మాట చెప్పింది నటి కంగనా రనౌత్.