డాక్టర్ పై పలుమార్లు లైంగిక దాడి... సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్

15-10-2015 Thu 14:33

హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న మనోజ్ (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో మనోజ్ ఉంటున్నాడు. అతని ఎదురు ప్లాట్ లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వైద్యురాలు ఉంటోంది. ఒక రోజు తనకు వైద్యం చేయడానికి పిలిచి, ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత, జరిగిన విషయాన్ని బయటపెడతానని బెదిరిస్తూ, పలుమార్లు లైంగిక దాడి జరిపాడు. తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్న ఆ వైద్యురాలు, చివరకు నిన్న రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో, మనోజ్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు, అపార్ట్ మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.