: 10 గంటల్లో 5 లక్షల మొబైళ్ల విక్రయం... రికార్డు నమోదు చేసిన ఫ్లిప్ కార్ట్

విజయదశమిని పురస్కరించుకుని దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ ప్రవేశపెట్టిన ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’కు అనూహ్య స్పందన లభించింది. ప్రత్యేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో రంగప్రవేశం చేసిన ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’కు నిన్న రాత్రి నుంచే వినియోగదారులు పోటెత్తారని ఆ సంస్థ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న రాత్రి ప్రారంభమైన మొబైల్ ఫోన్ల విక్రయాలు 10 గంటల్లోగా 5 లక్షల మార్కును తాకాయని పేర్కొంది. ఆన్ లైన్ లోనే కాక ఆఫ్ లైన్ లోనూ 10 గంటల వ్యవధిలో 5 లక్షల హ్యాండ్ సెట్ లు అమ్ముడుబోవడం ఇదే ప్రథమమని కూడా ఫ్లిప్ కార్ట్ వాణిజ్య విభాగం అధిపతి ముఖేశ్ బన్సల్ చెప్పారు. ఇక విక్రయమైన మొబైల్ ఫోన్ల విషయానికొస్తే, 75 శాతం మొబైళ్లు 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేసేవేనట. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు నాగ్ పూర్, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు, ఏపీలోని విశాఖ నుంచి పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ సైట్ ద్వారా కొనుగోళ్లు జరిపారని బన్సల్ వెల్లడించారు.

More Telugu News