మీవన్నీ తప్పుడు అభియోగాలే... దర్యాప్తు చేయండి: సీబీఐ డైరెర్టర్ కు షాకిచ్చిన ప్రత్యేక కోర్టు

15-10-2015 Thu 12:36

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అదనపు స్ప్రెక్ట్రం కేటాయింపు కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ అధికారులకు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మాజీ కార్యదర్శి శ్యామల్ ఘోష్ పై సీబీఐ అధికారులు తప్పుడు కేసులు బనాయించారని ఆక్షేపించింది. ఈ మేరకు నేటి ఉదయం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐ అధికారుల తీరును తప్పుబట్టారు. అంతేకాక తప్పుడు కేసులతో నానా తంటాలు పడుతున్న శ్యామల్ ఘోష్ కు ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు. ఇక శ్యామల్ ఘోష్ పై తప్పుడు కేసులు బనాయించిన సీబీఐ అధికారులపై విచారణకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీనిని సీబీఐ డైరెక్టర్ కే అప్పజెబుతూ న్యాయమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు.