క్రికెట్ కు జహీర్ ఖాన్ గుడ్ బై... నేడు అధికారిక ప్రకటన

15-10-2015 Thu 11:50

భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. మొన్నటిదాకా టీమిండియా పేస్ బౌలింగ్ బాధ్యతలను భుజాన మోసిన జహీర్ ఖాన్ ఫిట్ నెస్ లేమి కారణంగా దాదాపుగా జట్టులో స్థానం కోల్పోయాడు. అయినా ఇప్పటిదాకా అతడు రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇక జట్టులో తనకు స్థానం లభించదనుకున్నాడో, ఏమో తెలియదు కాని అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు నేడు అతడు అధికారికంగా ప్రకటించనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా జహీర్ ఖాన్ ఐపీఎల్ లో కొనసాగుతాడనే ఆశాభావాన్ని శుక్లా వ్యక్తం చేశాడు.