కుమారుడి ఆత్మశాంతికి హరిద్వార్ లో కర్మకాండలు చేయించిన సిల్వెస్టర్ స్టాలోన్

15-10-2015 Thu 11:48

హాలీవుడ్ లెజండ్ సిల్వెస్టర్ స్టాలోన్, మూడేళ్ల క్రితం మరణించిన తన కుమారుడు సేజ్ స్టాలోన్ ఆత్మశాంతి నిమిత్తం పవిత్ర హరిద్వార్ లో శ్రార్థకర్మలు చేయించారు. ఈ కార్యక్రమానికి ఆయన సోదరుడు మైఖేల్, ఆయన భార్య వచ్చారు. గతంలో ప్రతీక్ మిశ్రాపురి అనే పేరున్న ఓ జ్యోతిష్యుడిని కలిసిన సందర్భంలో ఆయన ఇచ్చిన సలహా మేరకు స్టాలోన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం లాస్ ఏంజెలెస్ లోని ఓ అపార్టుమెంటులో సేజ్ మృతదేహం కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్య నివేదికలు వెల్లడించాయి.