ముందు ఆ పని చేయండి... ఆ తర్వాత తాగండి: మాజీ సీఎం మాంఝీ

15-10-2015 Thu 10:48

బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పలు పార్టీల నేతలు ఓటర్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మద్యం ఏరులై పారుతోంది. ఈ క్రమంలో మాంఝీ మాట్లాడుతూ, ముందు ఓటు వేయండి, ఆ తర్వాత మందు తాగండి అంటూ సూచించారు. మాంఝీ ఈ మాట చెప్పడానికి పెద్ద కారణమే ఉంది. మద్యం మత్తులో పడిపోయిన పలువురు ఓటర్లు, అసలు పోలింగ్ కేంద్రానికే రావడం లేదట. ఈ నేపథ్యంలోనే ఆయన 'పెహలే మత్ దాన్, ఫిర్ మద్యపాన్' అనే సూత్రాన్ని చెప్పారు.