‘ద వీక్’ సర్వేదీ అదే మాట... బీహార్ బరిలో లౌకిక కూటమిదే విజయమట!

15-10-2015 Thu 07:14

బీహార్ లో బీజేపీకి షాకే తగలనుందా? అంటే, అవుననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు. ఇప్పటికే వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్ సర్వేల్లో ఒక సర్వే మినహా మిగిలినవన్నీ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లతో ఏర్పడిన లౌకిక కూటిమిదే విజయమని తేల్చేశాయి. తాజాగా నిన్న విడుదలైన ‘ద వీక్’ ఒపీనియన్ పోల్ సర్వే కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి పరాజయం తప్పదని తేల్చేసింది. మొత్తం 243 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో లౌకిక కూటమికి 122 సీట్లు దక్కనున్నట్లు ఆ సర్వే అంచనా వేసింది. ఇక లౌకిక కూటమికి చెక్ పెట్టి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేనని ఉవ్విళ్లూరుతున్న ఎన్డీయేకి 117 సీట్లు వస్తాయని ఆ సర్వే చెప్పింది. అయితే ఈ ఎన్నికల్లో లౌకిక కూటమికి లభించే ఓట్ల శాతం (38.2 శాతం) కంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే అధిక శాతం ఓట్లు (38.7 శాతం) వస్తాయట.