ఏపీకి 1700 టన్నుల కందిపప్పు... కేంద్ర మంత్రుల బృందం నిర్ణయం

14-10-2015 Wed 21:50

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1700 టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రమంత్రుల బృందం నిర్ణయించింది. నిత్యావసర ధరలపై ఢిల్లీలో కేంద్రమంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగింది. మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు, నిల్వలపై మంత్రుల బృందం సమీక్షించింది. ఈ సందర్భంగా ఏపీకి 1700 టన్నుల కందిపప్పు కేటాయించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. కాగా, హైదరాబాద్, పాట్నా, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో కందిపప్పు ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే.