‘స్పిన్’ తో సఫారీల ఆటకట్టిస్తున్న బౌలర్లు!

14-10-2015 Wed 18:56

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ స్పిన్నర్లు సఫారీలకు దడపుట్టిస్తున్నారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు పరుగులు తీసేందుకు వీలు లేకుండా మన స్పిన్నర్లు తమ బౌలింగ్ తో కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే ఆమ్లాను అక్షర పటేల్, డికాక్ ను హర్భజన్ వారిని వెనుతిరిగేలా చేశారు. రైనా కూడా స్పిన్ బౌలింగ్ వేసే అవకాశం ఉంది. దీంతో స్పిన్ ను అస్త్రంగా చేసుకుని సఫారీల ఆట కట్టించేందుకు టీమ్ ఇండియా బౌలర్లు ముందుకెళ్తున్నారు.