బతుకమ్మ ఆడేందుకు అనుమతించని ఏపీఎన్జీవో అధికారులు... ఉద్రిక్తత

14-10-2015 Wed 15:25

ఈ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీఎన్జీవో) భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ కార్యాలయం ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు అనుమతి లేదని ఏపీఎన్జీవో అధికారులు చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. బతుకమ్మ ఆటలు ఆడుకునేందుకు అనుమతించాలంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. తమకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ మహిళలు నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపించడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. తెలంగాణ భూభాగంలో ఉంటూ, బతుకమ్మ పండగకు అనుమతించని ఏపీ అధికారులను తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా విమర్శించాయి.