బౌలింగ్ కోచ్ మాటను నిజం చేసిన సఫారీ బౌలర్లు!

14-10-2015 Wed 14:11

అవును, దక్షిణాఫ్రికా బౌలర్లు వారి బౌలింగ్ కోచ్ లాంగ్ వెల్ట్ మాటను పొల్లు పోకుండా పాటించారు. టీమిండియాకు షాకిచ్చారు. అయినా, లాంగ్ వెల్ట్ ఏం చెప్పాడు? సఫారీ బౌలర్లు ఏం చేశారు? అనేగా మీ డౌటు. తొలి టీ20లో టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ బ్యాటును ఝుళిపించాడు. ధర్మశాలలో జరిగిన ఆ మ్యాచ్ లో కేవలం 79 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 106 పరుగులు పిండుకున్నాడు. ఇక మొన్న కాన్పూర్ లో జరిగిన తొలి వన్డేలో 133 బంతులను ఎదుర్కొన్న అతడు 150 పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్ ను ప్రారంభించే రోహిత్ శర్మను తొలి పది బంతుల్లోనే పెవిలియన్ చేర్చాలని సఫారీ బౌలింగ్ కోచ్ లాంగ్ వెల్ట్ భావించాడు. ఇందుకోసం తమ బౌలర్లకు అతడు మంచి కోచింగే ఇచ్చినట్టున్నాడు. బౌలింగ్ కోచ్ మాట ప్రకారం ఆ జట్టు బౌలర్లు కేవలం పదంటే పది బంతుల్లోనే రోహిత్ ను ఔట్ చేశారు. నేటి మ్యాచ్ లో కేవలం తొమ్మిది బంతుల్లో మూడు పరుగులు రాబట్టిన రోహిత్, లాంగ్ వెల్ట్ చెప్పినట్లుగా సరిగ్గా పదో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.