సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

14-10-2015 Wed 11:11

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను గెలిపిస్తే రాష్ట్రానికి హోదా ఇస్తామంటూ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారిపై కిరోసిన్ పోసి అగ్గిపుల్ల గీయండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రజలెవరూ బలిదానాలు చేసుకోవద్దని ఒంగోలులో మాట్లాడుతూ సూచించారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. సీఎంకు ధైర్యం ఉంటే హోదా కోసం ప్రధానమంత్రికి వాస్తవాలు చెప్పి ఒప్పించాలని లేకుంటే చేతులు ముడుచుకుని కూర్చోవాలని విమర్శించారు. శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి ఆ రోజే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరుసటి రోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని రామకృష్ణ చెప్పారు.