: నాడు ప్రణబ్, నేడు అరుణ్ జైట్లీ...‘ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి’ అవార్డుకు ఎంపిక

ఐదేళ్ల క్రితం యూపీఏ-2 సర్కారులో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రస్తుత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి’గా ఎంపికయ్యారు. మళ్లీ ఐదేళ్లకు గాని ఆ అవార్డు భారత ఆర్థిక మంత్రికి దక్కలేదు. ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ ఏటా అందిస్తున్న ఈ అవార్డుకు ఈ ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎంపికయ్యారు. ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత గడచిన 18 నెలల్లో భారత్ ఆర్థిక వృద్ధి బాటలో పయనిస్తోంది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ లే కారణమంటూ జాతీయంగానే కాక అంతర్జాతీయంగానూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఆర్థిక మంత్రి హోదాలో జైట్లీ చర్యలు కూడా కీలకమేనని ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ వెల్లడించింది. భారత ఆర్థిక వృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న జైట్లీకి ఈ ఏడాది ‘ఆసియా ఉత్తమ ఆర్థిక మంత్రి’ అవార్డును ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

More Telugu News