రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానిని కలవనున్న టీడీపీ అధినేత

13-10-2015 Tue 19:22

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం ఉత్తరాఖండ్, హర్యానా ముఖ్యమంత్రులతో కలిసి 3.45 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమవుతారు. స్వచ్ఛ భారత్ పై నీతిఆయోగ్ ఉపసంఘం నివేదికను ప్రధానికి అందజేయనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 5.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు బాబు ఆహ్వానిస్తారు.