: ఎంహెచ్ 17 విమాన ప్రమాదానికి కారణం క్షిపణి దాడే: నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు

క్షిపణి దాడి చేసి మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 17ను కూల్చివేశారన్న ఆశ్చర్యకర విషయాన్ని నెదర్లాండ్స్ సేఫ్టీ బోర్డు తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది జులైలో తూర్పు ఉక్రెయిన్ లో ఎంహెచ్ 17 కూలిపోయిన సంగతి తెలిసిందే. 298 మంది ప్రయాణికులతో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రష్యాలో తయారైన 9ఎమ్ 38 క్షిపణితో ఈ విమానం ముందు భాగాన్నికొట్టడంతో ఈ దారుణ ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ విమానాన్ని కూల్చివేసిన ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే, క్షిపణితో ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని మాత్రం ఈ నివేదికలో పేర్కొనలేదు.

More Telugu News