మహిళా దొంగలతో జాగ్రత్త: ఢిల్లీ మెట్రో పోలీసులు

13-10-2015 Tue 18:24

ఢిల్లీ మెట్రో రైళ్లలో జేబులు కొట్టడం లాంటి దొంగతనాలు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. రైళ్లలో బ్యాగులు దొంగతనం చేసే మహిళల సంఖ్య బాగానే ఉందన్నారు. మహిళా దొంగల విషయంలో ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఢిల్లీ మెట్రో సర్వీసులలో 182 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నామన్నారు. 2014 లో మెట్రో రైలు దొంగతనాల్లో సుమారు మూడు వందల మంది మహిళలను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మెట్రో రైళ్లలో దొంగతనాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో మఫ్టీలో పోలీసులను నియమిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.